న్యూఢిల్లీ : పెంపుడు జంతువులతో మనుషుల బాండింగ్ ఎప్పటికీ ప్రత్యేకమే. అవి తమ షరతుల్లేని ప్రేమతో మన జీవితాన్ని మరింత కలర్ఫుల్గా మార్చేస్తాయి. దేశీ వధువు తన పెండ్లి హడావిడిలోనూ కొద్దిసేపు బ్రేక్ తీసుకుని పెంపుడు కుక్కకు ఆహారం తినిపిస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మేకప్ ఆర్టిస్ట్ సిమర్ కే ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఈ వీడియోను ప్రస్తుతం లక్ష మందికి పైగా వీక్షించారు. ఈ షార్ట్ క్లిప్‌లో దివ్య అనే పెండ్లి కూతురు పెండ్లి వేడుకకు ముస్తాబవుతూ డ్రెస్ వేసుకుంటూనే కొద్దిసేపు తన పెంపుడు కుక్క బుజోకు బిన్యానీ తినిపించడం కనిపించింది. వధువు తన ప్రయారిటీలను ఎలా సెట్ చేసుకుందని వీడియోలో టెక్ట్స్ సాగుతుంది.
పెంపుడు జంతువులు ఎప్పటికీ ప్రత్యేకమే..తన బుజో ఆకలితో ఉండటంతో అందమైన పెండ్లికూతురు దివ్య డ్రెస్సింగ్‌కు కొద్దిసేపు విరామం ఇచ్చి తన చేతులతో కుక్కకు ఫీడ్ చేస్తున్నదని ఈ వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతూ పెద్దసంఖ్యలో కామెంట్లు పెడుతూ నవ వధువుకు శుభాకాంక్షాలు తెలిపారు.