Dera Baba | రంజిత్‌సింగ్ హత్య కేసులో డేరా బాబా నిర్దోషి.. ప్రకటించిన పంజాబ్-హర్యానా హైకోర్టు
Dera Baba | డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh) అలియాస్ డేరా బాబా (Dera Baba).. తన మేనేజర్ రంజిత్ సింగ్ (Ranjit Singh) నిర్దోషిగా బయటపడ్డాడు. రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ నిర్దోషి అని పంజాబ్-హర్యానా హైకోర్టు (Punjab and Haryana High Court) ప్రకటించింది
Dera Baba : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh) అలియాస్ డేరా బాబా (Dera Baba).. తన మేనేజర్ రంజిత్ సింగ్ (Ranjit Singh) నిర్దోషిగా బయటపడ్డాడు. రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ నిర్దోషి అని పంజాబ్-హర్యానా హైకోర్టు (Punjab and Haryana High Court) ప్రకటించింది. డేరా బాబాతోపాటు మరో నలుగురు దోషులను కూడా హైకోర్టు దోషులుగా పేర్కొంది. కింది కోర్టు ఆ ఐదుగురిని దోషులుగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
డేరా బాబా దగ్గర మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ 2002 జూలై 10న హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాలోని ఖాన్పూర్ కొలియన్ గ్రామంలో దారుణ హత్యకు గురయ్యారు. అతడు తన పొలంలో పనిచేస్తుండగా చంపేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐ.. 2007లో ఆరుగురు నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది. 2008లో అభియోగాలు నమోదు చేయగా.. 2021 అక్టోబర్ 1న కింది కోర్టు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది. డేరా బాబాతోపాటు మరో నలుగురిని దోషులుగా నిర్ధారించింది.
ఇప్పుడు పంజాబ్-హర్యానా హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఆ కోర్టు దోషులుగా నిర్ధారించిన ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. కాగా డేరా బాబాపై ఈ హత్యకేసు మాత్రమేగాక తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడట్లుగా కేసు ఉంది. ఈ కేసులో గర్మీత్ను దోషిగా తేల్చిన కోర్టు.. 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. దాంతో గత నాలుగేళ్లుగా జైల్లో ఉంటున్న ఇప్పటికే ఏడు సార్లు పెరోల్‌పై బయటికి వచ్చాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

