2018లో డెన్వీ-2 వల్లే డెంగ్యూ విజృంభణ

- సేకరించిన నమూనాల్లో 33 శాతం ఈ వేరియంట్
- పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2018లో అధికంగా డెంగ్యూ కేసులు నమోదవడానికి వైరస్ (డెన్వీ)లో వచ్చిన కొత్త వేరియంట్ ‘డెన్వీ-2’ కారణమని తేలింది. పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ ఏడాది తెలంగాణ నుం చి సేకరించిన నమూనాల్లో 34శాతం ఈ వేరియంట్ ఉన్న ట్టు నిర్ధారించింది. ఈ విషయాన్ని తాజాగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మ్యాగజైన్ ప్రచురించింది. ఆ ఏడాది దేశవ్యాప్తంగా 4,963 నమూనాలను పుణె ఎన్ఐవీ సేకరించింది. అందులో డెన్వీ-2 వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ రకం వల్ల తీవ్రమైన ఒంటి నొప్పులు, వాంతులు, ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం, కడుపులో తీవ్రమైన నొప్పి, నీరసం, అంతర్గత రక్తస్రావం వంటివి ఎక్కువగా సంభవించినట్టు అధ్యయనంలో పేర్కొన్నది. 2018లో 6,362 కేసు లు నమోదు కాగా ఇద్దరు మరణించారు. 2019లో 13,361 కేసులు నమోదు కాగా ఏడుగురు మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

