Krishna Janmabhoomi: కృష్ణ జన్మభూమి వద్ద డెమోలిషన్ డ్రైవ్.. తాత్కాలికంగా నిలిపివేసిన సుప్రీంకోర్టు
Krishna Janmabhoomi: మథురలోని కృష్ణ జన్మభూమి వద్ద కొనసాగుతున్న నిర్మాణాల తొలగింపు ప్రక్రియకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. నాయి బస్తీలో రైల్వేశాఖ కొన్ని నిర్మాణాలను తొలగిస్తోంది. అయితే దాన్ని అడ్డుకోవాలంటూ షా సుప్రీంలో పిటిషను వేశారు. దానిపై ఇవాళ సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల పాటు డెమోలిషన్ డ్రైవ్ ఆపేయాలన్నది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి(Krishna Janmabhoomi) సమీపంలో నాయి బస్తీలో రైల్వే శాఖ అక్రమ నిర్మాణాలను తొలిగిస్తోంది. అయితే ఆ డ్రైవ్‌ను నిలిపివేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల పాటు కూల్చివేత ప్రక్రియను నిలుపుదల చేయాలని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 66 ఏళ్ల యాకుబ్ షా వేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. నాయి బస్తీ ప్రాంతంలో తమ కుటుంబాలు 1880 నుంచి నివసిస్తున్నట్లు పిటీషన్లో తెలిపారు. ఆగస్టు 9వ తేదీ నుంచి రైల్వేశాఖ తొలగింపు ప్రక్రియ చేపట్టింది.
ఈ కేసులో వచ్చే వారం మళ్లీ వాదనలు కొనసాగున్నాయి. షా తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంతో చంద్ర సేన్ వాదిస్తున్నారు. కౌశిక్ చౌదరీ, రాధా తార్కర్, ఆరన్ షాలు అడ్వకేట్లుగా ఉన్నారు. స్థానిక సివిల్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా.. షా మాత్రం సుప్రీంను ఆశ్రయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

