Delivery Man harassment: డెలివరీ ఏజెంట్ లైంగిక వేధింపులు.. 50 లక్షలు పరిహారం కోరిన మహిళ
Delivery Man harassment| ఆ మహిళ వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. డెలివరీ వ్యక్తి లైంగిక వేధింపులు, నిర్లక్ష్యంగా అతడ్ని నియామించడం, తప్పుడు ప్రకటనలు, డెలివరీ సమయాన్ని తప్పుగా సూచించడం, వినియోగదారుల భద్రతను పట్టించుకోకపోవడంలో కంపెనీ వైఫల్యం వంటి పలు ఆరోపణలు చేసింది. వీటన్నింటికిగాను మొత్తం రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: డన్జో సంస్థకు చెందిన డెలివరీ ఏజెంట్ ఒక మహిళ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె డన్జో సంస్థ నుంచి రూ.50 లక్షలు పరిహారం కోరింది. ఈ మేరకు వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఖాన్ అనే మహిళ ఇటీవల ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసింది. డన్జో సంస్థకు చెందిన డెలివరీ ఏజెంట్ మద్యం మత్తులో అర్థరాత్రి వేళ ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. దీనిపై ప్రశ్నించిన ఆమెను అసభ్యంగా తిట్టాడు. దీంతో ఆ మహిళ తొలుత డన్జో సంస్థకు ఫిర్యాదు చేసింది. ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డన్జో డెలివరీ వ్యక్తిపై కేసు నమోదైంది.
కాగా, ఈ విషయం తెలిసిన డెలివరీ వ్యక్తి ఆ మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె వాట్సాప్ నంబర్‌కు మెసేజ్‌లు పంపి కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు. అలాగే కొంత మంది అమ్మాయిల ఫొటోలు కూడా పంపాడు. తన హెచ్చరికను పట్టించుకోని ఆ అమ్మాయిలను హత్య చేసినట్లు చెప్పాడు. కేసు వెనక్కి తీసుకోకపోతే వారి గతే ఆమెకు పడుతుందని వార్నింగ్ ఇచ్చాడు. లైంగికంగాను వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో డెలివరీ వ్యక్తి వేధింపులు, బెదిరింపులపై ఆ మహిళ తీవ్రంగా స్పందించింది. డన్జో సంస్థకు లీగల్ నోటీసులు పంపింది. అయితే డెలివరీ ఏజెంట్‌ను సమర్థించిన ఆ సంస్థ ఆ మహిళనే తప్పుపట్టింది.
ఈ నేపథ్యంలో ఆ మహిళ వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. డెలివరీ వ్యక్తి లైంగిక వేధింపులు, నిర్లక్ష్యంగా అతడ్ని నియమించడం, తప్పుడు ప్రకటనలు, డెలివరీ సమయాన్ని తప్పుగా సూచించడం, వినియోగదారుల భద్రతను పట్టించుకోకపోవడంలో కంపెనీ వైఫల్యం వంటి పలు ఆరోపణలు చేసింది. వీటన్నింటికిగాను మొత్తం రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. రాజ్ కుమార్ చౌహాన్, డాక్టర్ రాజేంద్ర ధర్లతో కూడిన ధర్మాసనం ఆ మహిళ ఫిర్యాదును పరిశీలించింది. దీనిపై రిప్లై ఇవ్వాలంటూ డన్జో సంస్థకు బుధవారం నోటీసులు జారీ చేసింది.
Peeing incident in Bus| మద్యం మత్తులో బస్సులోని మహిళా ప్రయాణికురాలి సీటుపై.. మూత్ర విసర్జన చేసిన వ్యక్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

