పాత పెట్రోల్, డీజిల్ వాహనాలు వాడితే 10 వేల జరిమానా

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు వాడితే రూ.10 వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. తాజాగా కేంద్రం ప్రకటించిన వాహనాల తుక్కు పాలసీని కఠినంగా అమలు చేయాలని ఢిల్లీ నిర్ణయించింది. ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య 3.5 లక్షలుగా ఉన్నట్లు అంచనా. కానీ 2018లో కేంద్రం తొలిసారి ఈ తుక్కు పాలసీని ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకూ కేవలం 2831 వాహనాలను మాత్రమే తుక్కు చేశారు. అంటే ఇది ఒక శాతం కంటే తక్కువ.
మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇలాంటి వాహనాలకు గరిష్ఠంగా రూ.10 వేలు జరిమానా విధించవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూడా ఇలాంటి వెహికిల్స్‌కు జరిమానాలు విధించే, తుక్కు చేసే అధికారం కూడా రవాణా శాఖకు ఉంది. కాలం చెల్లిన వాహనాల జాబితాను కూడా వేసి, ఆయా యజమానుల తమ వెహికిల్స్ తీసుకురావాల్సిందిగా ఆదేశించాలని కూడా రవాణా శాఖకు సుప్రీంకోర్టు సూచింది. ఇప్పటికైతే ఇలాంటి వాహనాలను గుర్తించడానికి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టకపోయినా.. ఇలాంటి నోటిఫికేషన్ల వల్ల సదరు యజమానులు తమ వాహనాలను తీసుకొస్తారని రవాణా శాఖ భావిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

