Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ తిరస్కరించిన ఢిల్లీకోర్టు
Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అక్రమ రీతిలో యూపీఎస్సీ పరీక్షను ఆమె క్లియర్ చేసినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఓబీసీ, దివ్యాంగ కోటాలో లబ్ధి పొందేందుకు పూజా ఖేద్కర్ .. యూపీఎస్సీని తప్పుదోవ పట్టించినట్లు జస్టిస్ చంద్ర ధారి సింగ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేద్కర్(IAS Trainee Puja Khedkar)కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అక్రమ రీతిలో యూపీఎస్సీ పరీక్షను ఆమె క్లియర్ చేసినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఓబీసీ, దివ్యాంగ కోటాలో లబ్ధి పొందేందుకు పూజా ఖేద్కర్ .. యూపీఎస్సీని తప్పుదోవ పట్టించినట్లు జస్టిస్ చంద్ర ధారి సింగ్ పేర్కొన్నారు. అర్హత లేకున్నా ఆమె ఆ కోటాలో లబ్ధి పొందినట్లు తెలిపారు. డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి ఐఏఎస్ శిక్షణకు ఎంపికైనట్లు సింగిల్ జడ్జి తెలిపారు. యూపీఎస్సీని మోసం చేయాలన్న ఉద్దేశం ఆమె ప్రయత్నంలో స్పష్టం కనిపిస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది.
వైకల్య సమస్యలు ఉన్నా వారి కోసం ఏర్పాటు చేసిన బినిఫిట్లను ఆమె పొందినట్లు కోర్టు తెలిపింది. ఆమె ఆర్థిక, సామాజిక బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా.. ఆమెకు పేరెంట్స్ కూడా సహకరించి ఉంటారని అంచనాకు వచ్చారు. కస్టడీలోనే ఆమెపై విచారణ కొనసాగాలని ధర్మాసనం తెలిపింది. యూపీఎస్సీ వ్యవస్థనే భ్రష్టుపట్టించే రీతిలో పూజా కుట్ర పన్నిందని, ఒకవేళ ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరీ చేస్తే, అది విచారణపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది.
ప్రస్తుతం యూపీఎస్సీ ఆమె సెలక్షన్‌ను రద్దు చేసింది. భవిష్యత్తులో ఎటువంటి పరీక్ష రాయకుండా ఆమెను పర్మనెంట్‌గా డిమాండ్ చేశారు. యూపీఎస్సీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఖేద్కర్‌పై కేసు బుక్ చేశారు. అరెస్టు చేయవద్దు అని ఆగస్టు 12వ తేదీన తాత్కాలిక రక్షణ కల్పించారు. కానీ తాజా ఆదేశాలతో ఆ తీర్పును రద్దు చేయాల్సి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

