ఢిల్లీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు.. 4 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్

న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తమకు అవసరమైనదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్ చేసిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ స్పష్టం చేసింది. ఏప్రిల్, మే నెలల్లో ఢిల్లీలో భారీగా కేసులు నమోదైనప్పుడు ఆక్సిజన్ అందక ఎంతో మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం, కేంద్రం మధ్య మాటల యుద్ధం నడిచింది. అప్పుడు ఢిల్లీ హైకోర్టు జోక్యంతో ఇతర రాష్ట్రాలకు సరఫరాను తగ్గించి ఢిల్లీకి ఎక్కువ ఆక్సిజన్‌ను పంపింది కేంద్ర ప్రభుత్వం.
కానీ తాజాగా ఆడిట్ కమిటీ రిపోర్ట్ మాత్రం ఢిల్లీ ప్రభుత్వ తీరును తప్పుబట్టేలా ఉంది. ఆ సమయంలో ఢిల్లీకి 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా.. కేజ్రీవాల్ ప్రభుత్వం మాత్రం 1200 మెట్రిక్ టన్నులు డిమాండ్ చేసిందని తేల్చింది. ఢిల్లీ వల్ల 12 రాష్ట్రాల్లో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది. మే 13వ తేదీన కూడా ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ, ఎయిమ్స్‌లాంటి ప్రభుత్వ దవాఖానాలతోపాటు వివిధ ప్రైవేటు హాస్పిటల్స్‌లో సరిపడా ఆక్సిజన్ ఉన్నందుకే ఆక్సిజన్ ట్యాంకర్లు లోడ్ ఖాళీ చేయలేదని తెలిపింది.
ఏప్రిల్ 29 నుంచి మే 10 మధ్య ఢిల్లీలో ఆక్సిజన్ వినియోగ లెక్కలను సవరించాలని, కొన్ని హాస్పిటల్స్ వీటిలో భారీ తప్పిదాలు చేశాయని కమిటీ తేల్చి చెప్పింది. నిజానికి హాస్పిటల్స్ 1140 మెట్రిక్ టన్నులు వినియోగించినట్లు చెప్పగా.. లెక్క సరిచేసిన తర్వాత అది 209 మెట్రిక్ టన్నులుగా తేలిందని తెలిపింది. డిమాండ్‌ను సరిగా లెక్కించలేక ఢిల్లీ ప్రభుత్వం ఇలా అవసరం ఉన్నదాని కంటే ఎంతో ఎక్కువ ఆక్సిజన్ అడిగిందని కమిటీ తేల్చి చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

