Manish Sisodia | మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
Manish Sisodia
Manish Sisodia | ఢిల్లీ మాజీ ఉప ముక్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో సిసోడియా కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు మంగళవారం విచారణ జరిపింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ ఆయనను అరెస్టు చేయగా ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఇటీవల కస్టడీని ఏప్రిల్ 3 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ దర్యాప్తునకు సిసోడియా సహకరించారని, అయితే తనపై నేరారోపణ చేసే విషయాలను వెల్లడించిందలేదని తెలిపారు. అలాగే బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా కస్టడీ సైతం అవసరం లేదని, పారిపోయే అవకాశం లేదన్నారు. బెయిల్ పిటిషన్ను సీబీఐ వ్యతిరేకించింది. సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు కేసులో సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని వాదించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారించిన తర్వాత మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

