Kejriwal | ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం
Kejriwal | మద్యం పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి.. సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సింగ్ వాదనలు వినిపించారు.
Kejriwal | మద్యం పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి.. సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సింగ్ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 29న హైకోర్టు విచారణ జరుపనున్నది. మద్యం పాలసీ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ జూన్ 26న అరెస్టు చేసింది. అదే నెల 20న ట్రయల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ట్రయల్ కోర్టు నిర్ణయంపై ఈడీ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత సీబీఐ ఆయనను జైలులో అరెస్టు చేసింది. అనంతరం మూడురోజుల పాటు కస్టడీకి తీసుకున్నది. తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఇరువర్గాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై 29న వానదలు విననున్నది. ఇప్పటికే ఈడీ కేసులో సుప్రీంకోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇటీవల బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

