ఢిల్లీపై దట్టంగా పొగమంచు.. అధ్వాన్నంగా గాలి నాణ్యత
Delhi smog | దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ (గాలి నాణ్యత) అధ్వాన్నంగా ఉన్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ (గాలి నాణ్యత) అధ్వాన్నంగా ఉన్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ 337గా ఉన్నది. ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోవడంతో నగరంపై దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. దాంతో విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 337కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. కాగా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం.
ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఢిల్లీలోని లోధి రోడ్, సఫ్దర్‌గంజ్, ఎయిర్పోర్ట్ ఫ్లైవోవర్, ఎయిమ్స్ ఏరియాల్లో పొగమంచు కమ్మిన దృశ్యాలను కింది చిత్రాల్లో చూడవచ్చు.
Delhi | Dense fog covers the national capital this morning. Visuals from Lodhi Road, Safdarjung, Airport flyover and AIIMS. pic.twitter.com/8NKVd5Esa1
— ANI (@ANI) December 20, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AQI
- Delhi smog
- dense fog
- Lodhi Road
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

