Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలు నుంచి అర్వింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. దాంతో కోర్టు మూడు రోజుల సీబీఐ రిమాండ్ విధించింది.
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలు నుంచి అర్వింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. దాంతో కోర్టు మూడు రోజుల సీబీఐ రిమాండ్ విధించింది.
ఇవాళ్టితో మూడు రోజుల సీబీఐ రిమాండ్ ముగియడంతో అధికారులు మరోసారి కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చారు. విచారణ కోసం కేజ్రీవాల్‌ను రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. దాంతో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూలై 12 వరకు కేజ్రీ రిమాండ్ కొనసాగనుంది.
కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కేజ్రీవాల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 19న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈడీ కస్టడీలోనే తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను అదే కేసులో నాలుగు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేసింది. కేసుకు సంబంధించిన పలు వివరాలు రాబడుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

