ప్రయాణికుల్ని బెదిరించి.. బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్టు
Delhi Cops Extortionవిమాన ప్రయాణికుల్ని బెదిరించి, వారి వద్ద నుంచి బంగారం వసూల్ చేసిన ఇద్దరు పోలీసు హెడ్ కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ టర్మినల్ 3 వద్ద ఇద్దరు ప్రయాణికుల్ని బెదిరించిన పోలీసులు వారి నుంచి 50 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాబి
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల్ని బెదిరించి, వారి వద్ద నుంచి బంగారం వసూల్ చేసిన ఇద్దరు పోలీసు హెడ్ కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ టర్మినల్ 3 వద్ద ఇద్దరు ప్రయాణికుల్ని బెదిరించిన పోలీసులు వారి నుంచి 50 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాబిన్ సింగ్, గౌరవ్ కుమార్ అనే ఇద్దరు పోలీసులు టర్మినల్ 3 వద్ద సెక్యూర్టీ గార్డులుగా చేస్తున్నారు. అయితే దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికుల్ని వాళ్లు టార్గెట్ చేసేవాళ్లు. ప్యాసింజర్ల వద్ద ఉన్న బంగారు ఆభరణాలను ఆ పోలీసులు బెదిరించి తీసుకున్నారు.
అయితే ఆ ఇద్దరు పోలీసుల నుంచి సుమారు 51 లక్షల విలువైన బంగారాన్ని రికవర్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సలావుద్దీన్ కతా అనే వ్యక్తి నుంచి సుమారు 600 గ్రాముల బంగారాన్ని, షేక్ ఖాదర్ బాషి నుంచి మరో 400 గ్రాముల బంగారాన్ని ఆ పోలీసులు లాక్కున్నట్లు ఫిర్యాదులో తేలింది. బెదిరింపులకు పాల్పడిన పోలీసుల్ని గుర్తించి విచారణ చేపట్టారు. ఆ తర్వాత వాళ్లను అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

