‘దేశ్ కే మెంటర్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ‘దేశ్ కే మెంటర్’ కార్యక్రమాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కెరీర్ ఎంపికపై వివిధ రంగాలలో విజయం సాధించిన వ్యక్తులు మార్గదర్శకత్వం వహిస్తారు. విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా రాణించేందుకు తమ విలువైన సూచనలు, సలహాలు అందిస్తారు.
చాలా మంది పిల్లలకు తమ ఆలోచనను బహిర్గతం చేసే సామర్థ్యం పరిమిత స్థాయిలో ఉంటుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. చదువులో మంచిగా ఉంటే, డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలని అనుకుంటారని, తాను కూడా చిన్నప్పుడు అలాగే అనుకునే వాడినంటూ గుర్తు చేసుకున్నారు.
విద్యార్థులు తాము ఎంచుకునే రంగం గురించి మంచి మెంటర్లు పూర్తి అవగాహన కల్పించడంతోపాటు వారికి అన్ని విధాలా మార్గదర్శకత్వం వహిస్తారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. విద్యార్థులే స్వయంగా తమ కెరీర్‌కు గైడెన్స్ ఇచ్చే మెంటర్‌ను ఎంచుకోవచ్చని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

