Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సీబీఐ చార్జిషీట్
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 25న పొడిగించిన విషయం తెలిసిందే.
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 25న పొడిగించిన విషయం తెలిసిందే. కేసు విచారణ ఆగస్టు 8న జరుగనున్నది. తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తిహార్ జైలులోనే కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది.
సీఎం కేజ్రీవాల్‌తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరు నేతలకు జూలై 31 వరకు రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 31 వరకు కస్టడీని పొడిగించింది. ఇంతకు ముందు జూలై 12న సీబీఐ విచారిస్తున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కేసులకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరుచగా.. కస్టడీని ఈ నెలాఖరు వరకు పొడిగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

