Rakesh Asthana | రాకేశ్ అస్తానా నియామకానికి వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం
Rakesh Asthana | సరిహద్దు సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేయడానికి మూడు రోజుల ముందు ఆయనను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ అస్తానా ( Rakesh Asthana ) నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని గురువారం ఆమోదించింది. ఆయన నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కోరింది. రాకేశ్ అస్తానా, గుజరాత్ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సరిహద్దు సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేయడానికి మూడు రోజుల ముందు ఆయనను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో మంగళవారం ఆ బాధ్యతలను రాకేశ్ అస్తానా స్వీకరించారు.
మరోవైపు ఢిల్లీలోని అధికార ఆప్ ప్రభుత్వం ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ అస్తానా నియామకాన్ని వ్యతిరేకించింది. డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులను ఈ పోస్ట్‌లో నియమించరాదన్న సుప్రీంకోర్టు తీర్పుకు ఇది విరుద్ధంగా ఉన్నదని ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఢిల్లీ అసెంబ్లీలో అన్నారు. రాకేశ్ అస్తానా నియామకం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరారు. ఈ మేరకు చేసిన తీర్మానాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

