118 అర్జున్ Mk-1A ట్యాంకులకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్డర్

న్యూఢిల్లీ: అత్యాధునిక 118 అర్జున్ Mk-1A ట్యాంకులకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ఇచ్చింది. రూ. 7,523 కోట్ల వ్యయంతో వీటిని సమకూర్చుకోనున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలోని అవడి భారీ వాహనాల ఫ్యాక్టరీ (HVF)తో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు గురువారం ఒప్పందం కుదుర్చుకున్నది. ‘రూ. 7,523 కోట్ల విలువైన ఈ ఆర్డర్, రక్షణ రంగంలో ” మేక్ ఇన్ ఇండియా ” కార్యక్రమానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ” ఆత్మనిర్భర్ భారత్ ” సాధించే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఈ ఒప్పందంలో భాగంగా తొలుత ఐదు అర్జున్ Mk-1A ట్యాంకులు 30 నెలలలోపు ఆర్మీకి సరఫరా అవుతాయి. అనంతరం ప్రతి ఏటా 30 ట్యాంకుల చొప్పున అందుబాటులోకి వస్తాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చెన్నైకి చెందిన కంబాట్ వెహికల్స్ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (CVRDE) అర్జున్ Mk-1A ట్యాంక్‌ను రూపొందించింది. 72 కొత్త ఫీచర్లు, స్వదేశీ సాంకేతికతో అర్జున్ ట్యాంక్ కొత్త వేరియంట్‌ను అభివృద్ధి చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్యే కూనంనేనికి కార్పొరేటర్ మునిగడప పద్మ వినతి
Man Kills Wife | భార్యను చంపిన వ్యక్తి.. ‘కొత్త అమ్మ’ను తెస్తానని కూతురికి నచ్చజెప్పే యత్నం
నాగుల చవితి వేడుకల్లో ముస్లిం మహిళల పూజలు
కాళోజీకి ఘన నివాళి.. న్యాయవాదుల రక్తదానం
Ex-Minister Thalasani | గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ మంత్రి తలసానికి ఘన స్వాగతం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

