భారత్, అమెరికా మధ్య బలమైన సైనిక సంబంధాలు: రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య బలమైన సైనిక సంబంధాలున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హవాయి ఓహూ ద్వీపంలోని అమెరికా భారత పసిఫిక్ కమాండ్, మిలిటరీ శిక్షణ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. కమాండర్ అడ్మిరల్ జాన్ అక్విలినో ఘన స్వాగతం పలికారు. భారత్, అమెరికా మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం పురోగతిపై రాజ్‌నాథ్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, ఐక్యత గురించి ప్రస్తావించారు. భారత్ అమెరికా ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అన్ని డొమైన్లలో భారత్- అమెరికా రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇండో పసిఫిక్ కమాండ్ నాయకత్వంతో విస్తృత స్థాయి చర్చలు జరిపారు.
ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. హవాయిలోని ఓహూ ద్వీపంలో అమెరికా భారత పసిఫిక్ కమాండ్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల సందర్శించినట్లు తెలిపింది. ఇరు దేశాల రక్షణ వర్గాలతో పలు అంశాలపై చర్చలు జరిపినట్లు పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
తుంగతుర్తి జూనియర్ కోర్టు నూతన జడ్జి బాధ్యతలు స్వీకరణ
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

