No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8వ తేదీన చర్చ..
No-Trust Motion: ఆగస్టు 8వ తేదీన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోదీ ఆ చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ఉభయసభల్లో ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం(No Confidence Motion)పై వచ్చే వారం పార్లమెంట్లో చర్చ జరనున్నది. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ఉభయసభల్లో ప్రకటన చేయడం లేదని, అందుకే కేంద్ర సర్కార్‌పై అవిశ్వాసాన్ని ప్రవేశపెడుతున్నట్లు విపక్షాలు పేర్కొన్న విషయం తెలిసిందే. లోక్‌సభలో ఎంపీ గౌరవ్ గగోయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ బిర్లా ఆమోదించారు. అయితే ఆ అంశంపై లోక్‌సభలో ఆగస్టు 8వ తేదీన చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. ఆ చర్చకు ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోదీ సమాధానం ఇస్తారన్నారు.
జూలై 20వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి రోజు ఉభయసభలు మణిపూర్ అంశం విషయంలో వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇవాళ తొమ్మిదో రోజు కూడా సభాకార్యక్రమాలు జరగలేదు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఎంపీ గౌరవ్ గగోయ్ నోటీసుపై 50 మంది సభ్యులు సంతకం చేశారు. లోక్‌సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ బలం 331. విపక్ష కూటమి ఇండియా బలం 144 మంది. అయితే ఈ తీర్మానాన్ని విపక్షం నెగ్గడం కుదరదు. కానీ మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడే విధంగా చేస్తుందని విపక్షాలు భావిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

