Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Blue Drum Murder : దేశంలో సంచలనం సృష్టించిన మీరట్, బ్లూడ్రమ్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు ఇద్దరికీ మరణశిక్ష విధిస్తూ మీరట్‌కు చెందిన జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది.
Blue Drum Murder : దేశంలో సంచలనం సృష్టించిన మీరట్, బ్లూడ్రమ్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు ఇద్దరికీ మరణశిక్ష విధిస్తూ మీరట్‌కు చెందిన జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. ఈ మేరకు జిల్లా కోర్టు జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా తీర్పు వెలువరించారు. ఈ కేసు విచారణ గత సెప్టెంబర్ 30న పూర్తికాగా.. నిందితులు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా నేరానికి పాల్పడ్డట్లు తేలింది.
దీంతో ఆరోజు తీర్పు రిజర్వ్ చేయగా, నేడు తీర్పు వెల్లడించారు. ఈ ఘటనలో హత్యకు గురైంది రస్తోగి భర్త సౌరభ్ భరద్వాజ్. తీర్పు వెలువడుతున్న సమయంలో జిల్లా జైలులో ఉన్న నిందితులు ఇద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. బ్లూ డ్రమ్ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలివి. ఉత్తర ప్రదేశ్, మీరట్‌కు చెందిన నేవీ మాజీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్.. 2025, మార్చి 3న హత్యకు గురయ్యాడు. అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి సౌరభ్‌ను హత్య చేశారు.
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో సౌరభ్‌ను హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ఒక బ్లూ డ్రమ్‌లో ఉంచారు. పైనుంచి సిమెంట్ పోసి, కప్పేశారు. దీంతో అతడి మృతదేహం అందులోనే కూరుకుపోయింది. ఘటన జరిగిన కొన్ని రోజులకు పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా ఈ హత్య ఘటన బయటపడింది. సౌరభ్‌ను ముస్కాన్, ఆమె క్లాస్మేట్, ప్రియుడు సాహిల్ కలిసి హత్య చేసినట్లు తేలింది. దీనిపై గత ఏడాది జూలైలో విచారణ ప్రారంభమైంది.
మొత్తం 13 నెలల్లోనే ఈ కేసు విచారణ పూర్తై, తీర్పు వెలువడటం విశేషం. ఈ కేసులో 126 వాదోపవాదాలు జరిగాయి. 22 మందికిపైగా సాక్షుల్ని కోర్టు విచారించి, చార్జిషీటు దాఖలు చేసింది. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

