బాట్లాహౌస్ దోషికి మరణ శిక్ష
- ఎన్కౌంటర్ కేసులో కోర్టు తీర్పు
- ఉగ్రవాది ఆరిజ్ఖాన్కు ఉరి
- రూ.11 లక్షల జరిమానా
- 2008లో ఢిల్లీలో ఇన్స్పెక్టర్ శర్మను కాల్చి చంపిన ఆరిజ్
- ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 15: సంచలనాత్మక బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో పోలీస్ ఇన్స్పెక్టర్ మోహన్‌చంద్ శర్మను కాల్చి చంపిన ఆరిజ్ ఖాన్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం ఉరి శిక్ష విధించింది. అతను రూ.11 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో రూ.10 లక్షలను వెంటనే శర్మ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని అడిషనల్ సెషన్స్ జడ్జి సందీప్ యాదవ్ తన తీర్పులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 13, 2008న ఢిల్లీలో సంభవించిన వరుస బాంబు పేలుళ్లలో 39 మంది మరణించారు. 159 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లు జరిగిన వారానికి సెప్టెంబర్ 19న బాట్లా హౌస్ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నది. ఢిల్లీలోని జామియా నగర్లో ఉన్న బాట్లాహౌస్లో ఉగ్రవాదులు దాక్కున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లారు. ఆ సమయంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఆరిజ్ తదితరుల ముష్కరుల తూటాలకు ఇన్స్పెక్టర్ శర్మ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. పోలీసు లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యా రు. పోలీసులపై ఆరిజ్ గ్యాంగే మొద ట కాల్పులు జరిపిందని కోర్టు కు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏటీ అన్సారీ తెలిపారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో ఆరిజ్కు సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ శర్మపై ఆరిజ్, అతని సహచరులు కాల్పులు జరిపి, ఆయన మరణానికి కారణమయ్యారని రుజువైందని ఈ నెల 8వ తేదీనే కోర్టు ప్రకటించింది. సోమవారం ఆరిజ్కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. నాడు ఘటనా స్థలం నుంచి పారిపోయిన ఆరిజ్ను ఫిబ్రవరి 14, 2018న అరెస్టు చేశారు. ఇదే కేసులో ‘ఇండియన్ ముజాహిదీన్’ ఉగ్రవాది షాజాద్ అహ్మద్‌కు 2013లో కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనిపై హైకోర్టులో షాజాద్ అప్పీల్ చేసుకోగా.. పెండింగ్‌లో ఉన్నది.
ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలి: బీజేపీ
బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో కోర్టు తీర్పు దేశంలో ఉగ్రవాదుల సానుభూతిపరులను బట్టబయలు చేసిందని బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల నిజాయితీపై ప్రశ్నలు లేవనెత్తిన సోనియాగాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ దేశానికి క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు.
బాట్లాహౌస్ పరిణామాలు
2008 సెప్టెంబర్ 13: ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు.. 39 మంది మృతి. 159 మందికి గాయాలు
సెప్టెంబర్ 19: పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్. ఎఫ్ఐఆర్ నమోదు
2010 ఫిబ్రవరి 2: లక్నోలో ఉగ్రవాది షాజాద్ అహ్మద్ అరెస్ట్
2013 జూలై 30: షాజాద్‌కు జీవితఖైదు
2018 ఫిబ్రవరి 14: దశాబ్దం తర్వాత ఉగ్రవాది ఆరిజ్‌ఖాన్ అరెస్ట్
2021 మార్చి 8: ఆరిజ్‌ఖాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు
మార్చి 15: ఆరిజ్కు మరణశిక్ష.
హస్తిన రాజకీయాల్ని మార్చిన ఎన్కౌంటర్
బాట్లాహౌస్ ఎన్కౌంటర్ హస్తిన రాజకీయాలను మార్చివేసింది. అంతకుముందు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరుగగా, ఈ ఎన్కౌంటర్ తర్వాత విభజన రాజకీయాలు మొదలయ్యాయి. బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్‌ను బోగస్ ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించేందుకు ఒక వర్గం మీడియా, రాజకీయ నాయకులునకిలీ వార్తలు ప్రచారం చేశారని నాటి ఢిల్లీ స్పెషల్ సెల్ అధిపతి కర్నాల్ సింగ్ తన పుస్తకంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

