Shambhu Border | తెరుచుకోని పంజాబ్-హర్యాన సరిహద్దు.. ట్రాక్టర్ మార్చ్‌కు సన్నద్ధమవుతున్న రైతు నేతలు..!
Shambhu Border | పంజాబ్-హర్యానా శంభు సరిహద్దు తెరవాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా తెరుచుకోలేదు. ఇటీవల వారంరోజుల్లోగా తెరవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజలు, వాహనదారుల రాకపోకలకు అనుమతించాలంటూ పంజాబ్-హర్యాన హైకోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు కోర్టులు ఆదేశాలు ఇచ్చింది.
Shambhu Border | పంజాబ్-హర్యానా శంభు సరిహద్దు తెరవాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా తెరుచుకోలేదు. ఇటీవల వారంరోజుల్లోగా తెరవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజలు, వాహనదారుల రాకపోకలకు అనుమతించాలంటూ పంజాబ్-హర్యాన హైకోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు కోర్టులు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు విధించిన గడువు నేటితో ముగియనున్నది. సరిహద్దులను తెరిచేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చొరవ తీసుకోలేదు. హైకోర్టు తీర్పుపై హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఫిబ్రవరి నుంచి ఆందోళనలు చేస్తున్న రైతులు హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీకి పాదయాత్రలు చేస్తామని ప్రకటించారు. శంభు సరిహద్దు తెరిచిన వెంటనే ఢిల్లీకి పాదయాత్ర చేస్తానని రాజకీయేతర ఐక్య కిసాన్ మోర్చా సభ్యుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ ప్రకటించారు. ఆగస్టు 15న ట్రాక్టర్ మార్చ్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ట్రాక్టర్ మార్చ్‌ను దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రైతుల ఉద్యమంలో వాటర్ కెనన్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నవదీప్ జల్బేరా పంజాబ్-హర్యానా హైకోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్ పొందడంతో బుధవారం అంబాలా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించే నిర్ణయాన్ని రైతు నేతలు వాయిదా వేశారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్, రాంలీలా మైదాన్‌లో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దారిలో ఎక్కడైనా అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే అక్కడే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. శుభకరన్ మరణించిన అంశంపై హర్యానా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని దల్లెవాల్ ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా సంయుక్త సమావేశం జూలై 22న న్యూఢిల్లీలో జరగనుంది. రెండు ఫ్రంట్లు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌తో సహా ప్రతిపక్ష నేతలందరికీ లేఖలు రాశాయి. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎంఎస్పీ హామీ చట్టంతో సహా రైతుల అన్ని డిమాండ్లపై ప్రైవేట్ బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.
రానున్న రోజుల్లో రెండు ఫ్రంట్ల అధికారులు హర్యానాలో ఇంటింటికీ వెళ్లి రైతులు, కూలీలకు అవగాహన కల్పించనున్నారు. సెప్టెంబర్ 15న హర్యానాలో జాతీయ స్థాయి కిసాన్ మహాపంచాయత్ జరగనుంది. ఇందులో లక్షలాది మంది రైతులు పాల్గొంటారు. మరో వైపు అంబాలా డిప్యూటీ కమిషనర్ షాలీన్ జిల్లాలో ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ సెక్షన్ 163ని విధించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం అమలులో ఉంటుంది. ఈ ఆదేశాలు జూలై 17 నుంచి వచ్చే రెండు నెలల పాటు అమల్లో ఉండనున్నాయి. పంజాబ్‌లోని భటిండా, సిర్సా నుంచి వెయ్యి మంది రైతుల బృందం 17, 18 తేదీల్లో అంబాలా ఎస్పీ కార్యాలయానికి ఘెరావ్ చేయడానికి చేరుకున్నారు. ఇక సరిహద్దును తెరవాలన్న హైకోర్టు ఆదేశాలపై హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 22న విచారించనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

