అమెరికాలో భరతనాట్యం, కూచిపూడి డ్యాన్సర్‌పై దుండగుల కాల్పులు
కోల్‌కతాకు చెందిన భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారుడు అమర్నాథ్ ఘోష్‌ను అమెరికాలో దుండగులు కాల్చిచంపారని నటి దేవలీన భట్టాచార్జి తెలిపారు.
న్యూయార్క్ : కోల్‌కతాకు చెందిన భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారుడు అమర్నాథ్ ఘోష్‌ను అమెరికాలో దుండగులు కాల్చిచంపారని నటి దేవలీన భట్టాచార్జి తెలిపారు.
అమర్నాథ్ ఘోష్ మిసోరిలోని సెంట్లూయిస్లో మంగళవారం సాయంత్రం ఈవెనింగ్ వాక్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సెంట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో ఘోష్ డ్యాన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్ఏ) చదువుతున్నారు.
ఘోష్ భౌతిక కాయాన్ని భారత్ తరలించేందుకు సహకరించాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్, ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విజ్ఞప్తి చేశారు. అమర్ నాథ్ ఘోష్ ఆ కుటుంబంలో ఒక్కడే సంతానమని, అతడి తల్లి మూడేండ్ల కిందట మరణించగా, తండ్రి ఘోష్ చిన్ననాటే మరణించారని నటి పేర్కొన్నారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

