Dahi Maggi | చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా లేటెస్ట్గా దహీ మ్యాగీ నెట్టింట సందడి చేస్తోంది. ఇక మ్యాగీ అంటే దేశీ రెసీపీల్లో ప్రత్యేక స్ధానం ఉంటుంది. నిమిషాల్లో రెడీ చేసే ఈ డిష్‌ను పిల్లల నుంచీ పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఇలాంటి మ్యాగీతో ప్రయోగం చేస్తూ దహీ మ్యాగోను ట్రై చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఇప్పటికే ఫాంటా మ్యాగీ, మ్యాంగో మ్యాగీ, బ్రెడ్ పకోడా మ్యాగీ వంటి ఎక్స్పరిమెంట్స్ నెటిజన్లకు చిరాకు తెప్పించగా తాజాగా దహీ మ్యాగీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ దహీ మ్యాగీని తయారుచేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరలవుతోంది. హ్యాండిల్ @వియో ఫుడ్ అనే ఇన్స్టాగ్రాం పేజ్‌లో ఈ వైరల్ వీడియోను షేర్ చేశారు.
ఈ క్లిప్‌లో ఓ మహిళ బాయిల్డ్ మ్యాగీ బౌల్లో పెరుగు, వెన్న, సాల్ట్, పాలును జోడించడం కనిపిస్తుంది. ఆపై దహీ మ్యాగీని సిద్ధం చేస్తుంది. మ్యాగీలో పెరుగు వేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ వైరల్ డిష్‌పై నెటిజన్లు పెదవివిరిచారు. ఇదేం ఫుడ్ కాంబినేషన్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read More :