దూసుకొస్తున్న యాస్ తుఫాన్.. అప్రమత్తమైన ఒడిశా సర్కారు
Yaas Cyclone: యాస్ తుఫాన్ తీరం వైపు శరవేగంగా దూసుకొస్తున్నది. దాంతో ఒడిశా ప్రభుత్వం

భువనేశ్వర్: యాస్ తుఫాన్ తీరం వైపు శరవేగంగా దూసుకొస్తున్నది. దాంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రచండ గాలుల వేగానికి పూరి గుడిసెలు కొట్టుకుపోతుండటంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
యాస్ తుఫాన్‌వల్ల తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఏపీలో కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. బుధవారం ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సముద్రం అలజడిగా ఉంటుందని, సముద్రంలో అలలు 4.5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
తుఫాన్ కారణంగా ఈ నెల 27 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను కేంద్రం హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎండీ కమిషనర్ కన్నబాబు సూచించారు. రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవుల్లో రెండో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. కలింగపట్నం సహా ఇతర ఓడరేవులకు అధికారులు తుఫాన్ సమాచారం అందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

