Cyber Scam | కర్ణాటకలో సైబర్ మోసం.. ట్రంప్ పేరుతో భారీ స్కామ్..!
Cyber Scam | సైబర్ నేరగాళ్లు (Cyber cheaters) టెక్నాలజీని వాడుకొని ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు (USA president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరుతో కర్ణాటక (Karnataka) లో దాదాపు 150 మందిని నమ్మించి రూ.కోటికి పైగా దోచుకొన్నారు.
Cyber Scam : సైబర్ నేరగాళ్లు (Cyber cheaters) టెక్నాలజీని వాడుకొని ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు (USA president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరుతో కర్ణాటక (Karnataka) లో దాదాపు 150 మందిని నమ్మించి రూ.కోటికి పైగా దోచుకొన్నారు. సైబర్ మోసగాళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నట్లు వీడియోలను సృష్టించారు.
తాను ట్రంప్ పేరుతో యాప్‌ను రూపొందించానని, పెట్టుబడులు పెట్టాలని తద్వారా అధిక లాభాలు గడించవచ్చని అమెరికా అధ్యక్షుడు సూచిస్తున్నట్లు ఉన్న పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో కర్ణాటకలోని తుమకూరు, బెంగళూరు, హవేరి ప్రాంతాలలోని దాదాపు 150 మంది ఆ వీడియోలను నమ్మి, అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి, యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. వారికి నేరగాళ్లు యూఎస్ ప్రభుత్వానివే అని నమ్మించేలా ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేశారు.
వారు పెట్టిన పెట్టుబడులకు లాభాలు వచ్చినట్లు కొద్ది నెలలపాటు చూపిస్తూ.. డబ్బు, ఇతర బహుమతులు అందించారు. కొద్ది రోజులకు యాప్ నిర్వాహకులు తమ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సైబర్ మోసగాళ్ల వలలో పడి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 మంది కోటి రూపాయలకు పైగా విలువైన డబ్బు పోగొట్టుకున్నట్లు గుర్తించామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇలాంటి నకిలీ యాప్‌లు, కంపెనీల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సైబర్ మోసగాళ్ల వలలో పడొద్దని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

