నాగాలాండ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా.. అదుపులోనే ఉంది: అమిత్ షా

న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో కూలీలపై ఆర్మీ కాల్పులు జరిపిన ఘటన పట్ల ఇవాళ లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. మాన్‌లోని ఓటింగ్‌లో తీవ్రవాదుల కదలికలు ఉన్నట్లు ఆర్మీకి సమాచారం వచ్చిందని, ఆ సమయంలో అనుమానాస్పద ప్రాంతంలో సుమారు 21 మంది కమాండోలు ఆపరేషన్‌కు సిద్దమయ్యారని, అయితే అక్కడకు వచ్చిన వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా.. ఆ వాహనం ఆగకుండా వెళ్లిందన్నారు. దీంతో ఆ వాహనంలో తీవ్రవాదులను తరలిస్తున్నట్లు అనుమానించి ఆర్మీ కాల్పులు జరపాల్సి వచ్చిందని షా తెలిపారు. ఆ వాహనంలో ఉన్న 8 మందిలో 6 మంది కాల్పులకు బలైనట్లు ఆయన చెప్పారు. గాయపడ్డ ఇద్దర్ని సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి ఆర్మీ తరలించిందన్నారు. ఈ ఘటన తర్వాత గ్రామస్తులు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి, రెండు వాహనాలు ధ్వంసం చేశారని, సైనికులపై తిరగబడ్డారని హోంమంత్రి చెప్పారు.
గ్రామస్థుల తిరుగుబాటులో ఓ సైనికుడు మృతిచెందినట్లు ఆయన వెల్లడించారు. ఆత్మరక్షణ కోసం సైనికులు ఫైరింగ్ జరిపారన్నారు. కాల్పుల వల్ల మరో ఏడు మంది పౌరులు మృతిచెందినట్లు షా వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా.. అదుపులోనే ఉందన్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని డిసెంబర్ 5వ తేదీన నాగాలాండ్ డీజీపీ, కమీషనర్ విజిట్ చేశారన్నారు. ఆర్మీ కాల్పుల ఘటన పట్ల ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామన్నారు. కేసు విచారణ కోసం రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నెల రోజుల్లోనే విచారణను పూర్తి చేయాలని సిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amit Shah
- army firing
- Nagaland
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

