CRPF Officer | అడవుల్లో కూంబింగ్.. పిడుగుపాటుకు సీఆర్పీఎఫ్ ఆఫీసర్ మృతి
CRPF Officer | జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లిన ఓ సీఆర్పీఎఫ్ ఆఫీసర్ పిడుగుపాటుకు మృతి చెందారు.
CRPF Officer | రాంచీ : జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లిన ఓ సీఆర్పీఎఫ్ ఆఫీసర్ పిడుగుపాటుకు మృతి చెందారు. మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు.
వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలోని కెరిబూరు గ్రామ సమీపంలోని అడవుల్లో గురువారం రాత్రి సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. రాత్రి 10.30 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. అడవిలో పిడుగులు కూడా పడ్డాయి. పిడుగుపాటుకు సీఆర్పీఎఫ్ అధికారి ఎం ప్రభో సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మరో అధికారి ఎస్కే మండల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభో సింగ్ కుటుంబానికి అండగా ఉంటామని అధికారులు భరోసానిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

