Crocodile head | ప్రయాణికుడి బ్యాగ్‌లో మొసలి తల.. ఎయిర్‌పోర్ట్‌లో స్వాధీనం
Crocodile head | ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఒక ప్రయాణికుడిపై సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. అతడి లగేజ్‌ను తనిఖీ చేశారు. బ్యాగ్‌లో మొసలి తల ఉండటం చూసి షాక్ అయ్యారు. దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఒక ప్రయాణికుడిపై సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. అతడి లగేజ్‌ను తనిఖీ చేశారు. బ్యాగ్‌లో మొసలి తల (Crocodile head) ఉండటం చూసి షాక్ అయ్యారు. దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయం విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. జనవరి 6న కెనడా పౌరుడైన వ్యక్తి టొరంటో వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. ఎయిర్ కెనడా విమానం ఎక్కే ముందు సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని చెక్ ఇన్ చేశారు. ఆ వ్యక్తిపై అనుమానం రావడంతో టెర్మినల్ 3 వద్ద లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో ఒక బ్యాగ్‌లో మొసలి తల ఉండటాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
కాగా, కస్టమ్స్ అధికారులు ఆ మొసలి తలను స్వాధీనం చేసుకున్నారు. దానిని గుడ్డతో చుట్టి లగేజ్‌లో అతడు ఉంచినట్లు తెలిపారు. 777 గ్రాముల బరువున్న మొసలి తలను ఢిల్లీకి చెందిన అటవీశాఖ అధికారులు పరిశీలించారు. మొసలి పిల్లకు చెందినదిగా వారు నిర్ధారించారు. దర్యాప్తు కోసం డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్కు దానిని పంపారు. ఆ కెనడా పౌరుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

