Crime news | ఇంట్లో విగతజీవులుగా పిల్లలు.. అపస్మారక స్థితిలో తల్లి..!
Crime news | ఓ ఇంటి తలుపులు శుక్రవారం నుంచి మూసి ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు కూడా బయటి నుంచి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లిన ఆనవాళ్లు కూడా లేవు. దాంతో అనుమానించిన ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడివున్నారు. వారి తల్లి అపస్మారక స్థితిలో ఉంది. తూర్పు ఢిల్లీలోని పాండవ్‌నగర్‌లోని శశిగార్డెన్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Crime news : ఓ ఇంటి తలుపులు శుక్రవారం నుంచి మూసి ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు కూడా బయటి నుంచి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లిన ఆనవాళ్లు కూడా లేవు. దాంతో అనుమానించిన ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడివున్నారు. వారి తల్లి అపస్మారక స్థితిలో ఉంది. తూర్పు ఢిల్లీలోని పాండవ్‌నగర్‌లోని శశిగార్డెన్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే సదరు ఏరియాకు చెందిన శ్యామ్ (42).. శుక్రవారం ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయాడు. అయితే అతని భార్య, 15 ఏళ్ల కొడుకు, 9 ఏళ్ల కుమార్తె ఇంటి నుంచి బయటికి రాలేదు. శనివారం మధ్యాహ్నం వరకు కూడా ఇంటికి తాళం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగులకొట్టి చూసిన పోలీసులకు విషాద దృశ్యం కంటపడింది.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. అపస్మారక స్థితిలో ఉన్న శ్యామ్ భార్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. శ్యామ్ తన ఇద్దరు పిల్లలను చంపడంతోపాటు భార్యపై కూడా దాడిచేసి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్యామ్ జాడ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

