Crime news | మైనర్ క్రీడాకారిణికి 60 మంది లైంగిక వేధింపులు.. కేరళలో దారుణం
Crime news | కేరళ రాష్ట్రంలో దారుణం జరిగింది. మైనర్ అయిన ఓ క్రీడాకారిణిపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60 మంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గడిచిన ఐదేళ్లల్లో తనపై 60 మందికి పైగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 18 ఏళ్ల ఆ క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Crime news : కేరళ రాష్ట్రంలో దారుణం జరిగింది. మైనర్ అయిన ఓ క్రీడాకారిణిపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60 మంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గడిచిన ఐదేళ్లల్లో తనపై 60 మందికి పైగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 18 ఏళ్ల ఆ క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మైనర్‌గా ఉన్నప్పుడే ఇదంతా జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
లైంగిక వేధింపులకు సంబంధించి మహిళ సమాఖ్య నిర్వహించిన కౌన్సిలింగ్ సెషన్లో క్రీడాకారిణి తనకు జరిగిన దారుణాల గురించి వివరించింది. 13 ఏళ్ల ప్రాయంలోనే తనపై అత్యాచారం జరిగిందని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. తన పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ తర్వాత కోచ్‌లు, క్లాస్మేట్స్, అథ్లెట్స్ఎక్కువగా లైంగికంగా వేధించారని వెల్లడించింది.
బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు 62 మందిని అనుమానితులుగా గుర్తించారు. వారిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలిని కౌన్సిలింగ్‌కు పంపించినట్లు పథనంథిట్ట ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

