Agnipath | కటాఫ్ కంటే తక్కువ మార్కులు వచ్చినా ఎంపిక.. అగ్నిపథ్ స్కీమ్‌లో స్కామ్?
దేశంలో ఇప్పటికే నీట్, నెట్ పేపర్ లీక్‌లపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ.. సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ పథకంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- అందరి మార్కుల వెల్లడికి ఆర్మీకి హైకోర్టు ఆదేశం
- ‘ది వైర్’లో సంచలన కథనం
- హైకోర్టుకు పలువురు అభ్యర్థులు
- అభ్యర్థులందరి మార్కుల వివరాలు వెల్లడించాలని ఆర్మీకి ఆదేశం
Agnipath | గ్వాలియర్: దేశంలో ఇప్పటికే నీట్, నెట్ పేపర్ లీక్‌లపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ.. సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ పథకంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2022, సెప్టెంబర్-నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో నిర్వహించిన అగ్నివీర్ రిక్రూట్మెంట్ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి.
కటాఫ్ కంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల పేర్లు మెరిట్ జాబితాలో కనిపించాయని కొంత మంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రిక్రూట్మెంట్ ర్యాలీ సందర్భంగా ఎంపిక చేసిన అభ్యర్థులందరి మార్కుల వివరాలు వెల్లడించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఆర్మీకి ఆదేశాలు జారీచేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్ చేసిన ‘ది వైర్’ తాజా కథనంలో కీలక విషయాలను వెల్లడించింది.
10 మార్కులు తక్కువ వచ్చినా సెలెక్ట్
ఫలితాలపై తీరుపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. తమకు వచ్చిన మార్కులు, కటాఫ్ స్కోర్, ఇతర అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలు తెలియజేయాలని కోరుతూ ఆర్మీకి ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. 169గా నిర్ణయించిన కటాఫ్ కంటే తక్కువ స్కోర్ 159 వచ్చిన నితీశ్ కుమార్ అనే అభ్యర్థి పేరు ఎంపికైన వారి జాబితాలో కనిపించింది. ఆర్మీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన సెలెక్ట్ అయిన అభ్యర్థుల లిస్టులో అతని రోల్ నంబర్ కనిపించింది. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నితీశ్ కుమార్ పేరును లిస్టు నుంచి తర్వాత తొలగించారని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

