Watch: స్కూల్ బాలికపై ఆవులు దాడి.. కొమ్ములతో పొడిచిన వీడియో వైరల్
Cow Attacks School Girl | స్కూల్ బాలికపై ఆవులు దాడి చేశాయి. ఒక ఆవు కొమ్ములతో ఎత్తి పడేసింది. కిందపడిన ఆ బాలికను చాలాసేపు కొమ్ములతో పొడిచింది. స్థానికులు స్పందించి ఆవుల బారి నుంచి ఆ బాలికను రక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చెన్నై: స్కూల్ బాలికపై ఆవులు దాడి చేశాయి. ఒక ఆవు కొమ్ములతో ఎత్తి పడేసింది. కిందపడిన ఆ బాలికను చాలాసేపు కొమ్ములతో పొడిచింది. స్థానికులు స్పందించి ఆవుల బారి నుంచి ఆ బాలికను రక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎంఎండీఏ కాలనీలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తున్నది. కొన్ని ఆవులు కూడా ఆ వీధిలో వెళ్తున్నాయి. స్కూల్ డ్రెస్‌లో ఉన్న బాలికపై ఒక ఆవు దాడి చేసింది. కొమ్ములతో ఎత్తి నేలపై పడేసింది. అనంతరం బాలికను కొమ్ములతో పొడుస్తూ కాళ్లతో తొక్కింది. మరో ఆవు కూడా ఆ బాలికపై దాడికి ప్రయత్నించింది.
కాగా, ఇది చూసిన బాలిక తల్లి, స్థానికులు భయాందోళన చెందారు. ఆవుల బారి నుంచి ఆమెను కాపాడేందుకు బాలిక తల్లితోపాటు కొందరు వ్యక్తులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ ఆవులు వారిపైనా దాడి చేయబోయాయి. చివరకు అతి కష్టంతో ఆవులను తరిమారు. తీవ్రంగా గాయపడిన ఆయేషాను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని ఒక ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ సంఘటన రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. ఆవుల యజమానిపై కేసు నమోదు చేశారు.
Video: (warning ) A school girl being attacked by a cow in MMDA colony, #Chennai. She survived with stitches. #Cowattack @dt_next @chennaipolice_ @chennaicorp pic.twitter.com/UMlJawj91k
— Raghu VP / ரகு வி பி / രഘു വി പി (@Raghuvp99) August 10, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Attack
- Chennai
- Cow
- School Girl
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

