మే 17న అత్యధికంగా కరోనా కేసులు!
కరోనా కేసులు | మే 17వ తేదీన బెంగళూరులో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అధికారులు

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతున్నట్లు అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే మే 17వ తేదీన బెంగళూరులో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అధికారులు వెల్లడించారు. ఈ కేసుల తీవ్రత వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. జూన్ 11వ తేదీ వరకు కేసులు స్థిరంగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపిన అధికారులు.. ఈ సమయంలో 14 వేల మంది మరణించే అవకాశం ఉందని అంచనా వేశారు.
కర్ణాటకలో నేటి నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. కరోనా తీవ్రత దృష్ట్యా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. గత 10 రోజులుగా విధించిన జనతా కర్ఫ్యూతో కరోనా కట్టడి కాకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన లాక్డౌన్.. మే 24 ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 47,930 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 490 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 18,776కు పెరిగింది. ప్రస్తుతం 5,64,485 యాక్టివ్ కేసులున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

