పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం
Covid-19 Guidelines Extended Till January 31st

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న కొవిడ్ సంబంధిత నిబంధనలను వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు పొడగించింది. మహమ్మారి వ్యాప్తి నివారణకు తప్పనిసరిగా దేశాలను పాటించాలని ఆదేశించింది.
ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరింత ముందుచూపు, డేటా విశ్లేషణతో పాటు స్థానిక, జిల్లాస్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించింది. పండుగల సీజన్లో రద్దీని నియంత్రించేందుకు రాష్ట్రాలు అవసరానికి అనుగుణంగా నిబంధనలను విధించవచ్చని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఒకే రోజు భారీగా ఒమిక్రాన్ కేసులు పెరగడంతో మంత్రిత్వశాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి వరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 578 కేసులు నమోదయ్యాయి. ఇందులో 151 మంది కోలుకున్నారు. అత్యధికంగా ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141, గుజరాత్లో 49, రాజస్థాన్‌లో 43, తెలంగాణలో 41 కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశంలో 6,531 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

