Covaxin: గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లో కోవాగ్జిన్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ( Covaxin ) టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కోవిడ్ టీకాల ఉత్పత్తి సంఖ్యను పెంచేందుకు మరిన్ని ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లో కోవాగ్జిన్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. ఇండియాకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ.. కోవిడ్ కోసం స్వదేశీయంగా కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి పరిచింది. గతంలో కేవలం హైదరాబాద్ యూనిట్ నుంచి మాత్రమే కోవాగ్జిన్ ఉత్పత్తి జరిగేది. ఇక నుంచి అంకలేశ్వర్ యూనిట్ నుంచి కూడా ఉత్పత్తి ప్రారంభించనున్నది. జనవరి నుంచి ఆగస్టు వరకు 7 కోట్ల టీకా డోసులను భారత్‌బయోటెక్ ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిపై కోవాగ్జిన్ టీకా సామర్థ్యం 77.8 శాతంగా ఉంది. ఇక ఆ టీకాతో డెల్టా వేరియంట్‌పై 65.62 శాతం రక్షణ ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

