కోవాగ్జిన్ టీకా సమర్థత 77.8 శాతం: ద లాన్సెట్

హైదరాబాద్: కోవిడ్ నియంత్రణ కోసం భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా 77.8 శాతం ప్రభావంతంగా పనిచేస్తున్నట్లు ద లాన్సెట్ పత్రిక తన కథనంలో తెలిపింది. నిర్జీవ వైరస్‌తో సాంప్రదాయపద్ధతిలో కోవాగ్జిన్ టీకాను తయారు చేస్తారు. ఈ టీకా తీసుకున్నవారిలో యాంటీబాడీలు దండిగా ఉత్పత్తి అవుతున్నట్లు నివేదికలో తెలిపారు. గత ఏడాది నవంబర్ నుంచి 2021 మే వరకు కోవాగ్జిన్ సమర్థతపై స్టడీ నిర్వహించారు. 18 ఏళ్ల నుంచి 97 ఏళ్ల మధ్య వయసున్న 24,419 మందిపై అధ్యయనం చేపట్టినట్లు మెడికల్ జర్నల్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో స్టడీ జరిగింది. కోవాగ్జిన్ రెండవ డోసు తీసుకున్న తర్వాత టీకా సమర్థత 77.8 శాతంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక డెల్టా వేరియంట్‌పై కోవాగ్జిన్ 65.2 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని రిపోర్ట్‌లో తెలిపారు. అయితే డెల్టా వేరియంట్‌పై ఏరకంగా కోవాగ్జిన్ పనిచేస్తుందో తెలుసుకునేందుకు మరింత స్టడీ అవసరమన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

