Couple Secretly Kills Daughter | 18 నెలల కుమార్తెను.. రహస్యంగా చంపి పాతిపెట్టిన దంపతులు
Couple Secretly Kills Daughter | దంపతులు ఏడాదిన్నర వయసున్న కుమార్తెను రహస్యంగా చంపారు. చిన్నారి మృతదేహాన్ని శ్మశానవాటికలో పాతిపెట్టారు. అయితే దీని గురించి పోలీసులకు లేఖ అందింది. దీంతో దర్యాప్తు జరిపి ఆ భార్యాభర్తలను అరెస్ట్ చేశారు.
ముంబై: దంపతులు ఏడాదిన్నర వయసున్న కుమార్తెను రహస్యంగా చంపారు. చిన్నారి మృతదేహాన్ని శ్మశానవాటికలో పాతిపెట్టారు. అయితే దీని గురించి పోలీసులకు లేఖ అందింది. దీంతో దర్యాప్తు జరిపి ఆ భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. (Couple Secretly Kills Daughter) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల జాహిద్ షేక్, 28 ఏళ్ల నూరామి భార్యాభర్తలు. వారికి 18 నెలల వయసున్న కుమార్తె లబీబా ఉంది. అయితే మార్చి 18న ఆ దంపతులు తమ కుమార్తెను హత్య చేశారు. స్థానిక శ్మశానవాటికలో రహస్యంగా పాతిపెట్టారు.
కాగా, ఈ సంఘటన జరిగిన మూడు వారాల తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖ స్థానిక పోలీసులకు అందింది. దీంతో దీనిపై దర్యాప్తు చేపట్టారు. పాతిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్మార్టం నిర్వహించగా ఆ పసి పాప తల, శరీరంపై గాయాలున్నట్లు తేలింది.
మరోవైపు ఆ చిన్నారి తల్లిదండ్రులైన జాహిద్ షేక్, నూరామిని పోలీసులు ప్రశ్నించారు. తొలుత కట్టుకథ చెప్పిన వారిద్దరూ తమ కుమార్తెను చంపినట్లు చివరకు ఒప్పుకున్నారు. అయితే ఎందుకు హత్య చేశారో అన్నది వెల్లడించలేదు. బుధవారం ఆ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత తమ కస్టడీలోకి తీసుకున్నారు. పసి పాపను ఎందుకు చంపారో అన్నది ఆరా తీస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

