హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో కరోనా కట్టడి

- వైరస్ నుంచి సమర్థ రక్షణ
- 12 వేలమంది డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందిపై సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 8: కరోనా చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) సమర్థవంతంగా పని చేస్తున్నదని మనదేశంలో భారీస్థాయిలో జరిగిన ఒక అధ్యయనం వెల్లడించింది. కరోనా ఔషధాల జాబితా నుంచి హెచ్‌సీక్యూను కేంద్రప్రభుత్వం తొలిగించిన రెండురోజుల్లోనే ఈ వివరాలు మంగళవారం బయటకురావటం విశేషం. ఆరువారాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలంపాటు హెచ్‌సీక్యూను (400 ఎంజీ లేదా 800 ఎంజీ చొప్పున) ఉపయోగిస్తే వైరస్ నుంచి 72 శాతం మేర రక్షణ లభిస్తున్నట్లుగా తెలిసింది. కరోనా సోకనివారేగాక సోకిన వారిలో కూడా హెచ్‌సీక్యూ మంచి ఫలితాలను ఇస్తున్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 44 దవాఖానల్లో పని చేస్తున్న 12 వేల మంది డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. గత ఏడాది మే-సెప్టెంబర్ మధ్య జరిగిన అధ్యయనం వివరాలను ‘అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా’ జర్నల్‌లో ప్రచురించారు.
మలేరియాపై బ్రహ్మాస్త్రం
మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కరోనాకు కూడా వాడవచ్చని, అది బ్రహ్మాండంగా పని చేస్తుందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గతంలో తెలిపారు. అమెరికాకు భారత్ భారీఎత్తున హెచ్‌సీక్యూ ఔషధాన్ని గతంలో పంపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

