cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
cop caught in woman's home | అర్ధరాత్రి వేళ ఒక పోలీస్ అధికారి మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. గమనించిన గ్రామస్తులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ పోలీస్ అధికారి వారిపై కాల్పులు జరిపాడు. ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పాట్నా: అర్ధరాత్రి వేళ ఒక పోలీస్ అధికారి మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. గమనించిన గ్రామస్తులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ పోలీస్ అధికారి వారిపై కాల్పులు జరిపాడు. ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. (cop caught in woman’s home) బీహార్‌లోని మధుబని జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బలిరాజ్గఢ్ మైనింగ్ ప్రాంతానికి రక్షణగా ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్‌లో ఏఎస్ఐ చంద్ర మోహన్ సింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో స్థానికంగా ఉన్న ఒక మహిళ ఇంట్లోకి అతడు ప్రవేశించాడు.
కాగా, గమనించిన గ్రామస్తులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. మహిళ ఇంట్లో ఉన్న ఆ పోలీస్ అధికారిని పట్టుకునేందుకు వారు ప్రయత్నించారు. అయితే తప్పించుకునే క్రమంలో ఏఎస్ఐ చంద్ర మోహన్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్‌తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.
మరోవైపు ఈ కాల్పుల గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 50 ఏళ్ల అశోక్ యాదవ్ చికిత్స పొందుతూ మరణించాడు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడైన ఆ ఏఎస్ఐని సస్పెండ్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆయనపై హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న చంద్ర మోహన్ సింగ్ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు వివరించారు.
అయితే ఈ సంఘటన బీహార్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏఎస్ఐ చంద్ర మోహన్ సింగ్ ఒక మహిళపై అత్యాచారం చేసే ఉద్దేశంతో ఆమె ఇంట్లోకి ప్రవేశించగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రతిఘటించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఆ పోలీస్ అధికారి వారిపై కాల్పులు జరిపి పారిపోయినట్లు ఆరోపించారు. ఇద్దరు మరణించగా మరో ఇద్దరు గాయపడినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పోలీసులు నేరస్తులుగా మారుతున్నారని ఆయన విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
‘వరి కొయ్యలను తగలబెట్టవద్దు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

