Contaminated Well Water | కలుషిత మంచినీళ్లు తాగి 93 మందికి అస్వస్థత..!
Contaminated Well Water | కలుషితమైన మంచినీళ్లు తాగి 93 మంది అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోగల ముగావ్ టాండా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ బావి నుంచే ఆ గ్రామానికి నీళ్లు సరఫరా అవుతాయి. ఆ నీళ్లు కలుషితం కావడంతో అందరూ అస్వస్థతకు గురయ్యారు.
Contaminated Well Water : కలుషితమైన మంచినీళ్లు తాగి 93 మంది అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోగల ముగావ్ టాండా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ బావి నుంచే ఆ గ్రామానికి నీళ్లు సరఫరా అవుతాయి. ఆ నీళ్లు కలుషితం కావడంతో అందరూ అస్వస్థతకు గురయ్యారు.
ముగావ్ టాండా గ్రామంలో మొత్తం 107 ఇండ్లు ఉన్నాయి. 440 మంది జనాభా ఉన్నారు. జూన్ 26, 27 తేదీల్లో 93 మంది అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో మెడికల్ క్యాంప్ వేసి చికిత్స అందించారు. 56 మంది గ్రామంలోనే రికవరీ అయ్యారు. మరో 37 మందిని పొరుగున ఉన్న మంజారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వాళ్లు కూడా కోలుకున్నారు.
బావిలోని కలుషిత నీళ్లే ప్రస్తుత పరిస్థితికి కారణమని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఆ బావిని సీజ్ చేశారు. పొరుగూరిలోని ఫిల్టర్ నుంచి ముగావ్ టాండా గ్రామానికి తాగు నీళ్లను సరఫరా చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

