BR Gavai: నాకు రాజ్యాంగమే సుప్రీం: సీజేఐ బీఆర్ గవాయ్
BR Gavai: రాజ్యాంగమే అత్యున్నతమైందని, ప్రజాస్వామ్యంలోని మూడు శాఖలు దాని కిందే పనిచేస్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. పార్లమెంట్‌కు సవరణలు చేసే అధికారం ఉందని, కానీ అది రాజ్యాంగంలోని మౌళిక అంశాలను మార్చలేదని అన్నారు.
అమరావతి: తన వరకు రాజ్యాంగమే అత్యున్నతమైందని, ప్రజాస్వామ్యంలోని మూడు శాఖలు దాని కిందే పనిచేస్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(BR Gavai) పేర్కొన్నారు. పార్లమెంట్‌కు సవరణలు చేసే అధికారం ఉందని, కానీ అది రాజ్యాంగంలోని మౌళిక అంశాలను మార్చలేదని అన్నారు. 52వ సీజేఐగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ గవాయ్.. మహారాష్ట్రలోని అమరావతి సిటీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు.
కొందరు పార్లమెంటే సుప్రీం అని చెబుతారని, కానీ తన అభిప్రాయంలో రాజ్యాంగమే పరమోన్నతమైందన్నారు. ప్రజాస్వామ్యంలోని ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడిషియరీ వ్యవస్థల్లో ఏది మేటి అన్న చర్చ ఎప్పుడూ జరుగుతుందన్నారు. చాలా మంది పార్లమెంటే సుప్రీం అన్న అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారని, కానీ తన వరకు రాజ్యాంగమే అత్యున్నతమైందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేస్తూ ఓ జడ్జీ వ్యక్తిగతంగా వ్యవహరించలేరన్నారు.
తాము డ్యూటీలో ఉన్నామన్న విషయాన్ని ప్రతి జడ్జీ గుర్తుంచుకోవాలని, పౌరుల హక్కుల పట్ల.. రాజ్యాంగ విలువలు, సూత్రాల పట్ల రక్షకులమని ఆయన తెలిపారు. తమకు కేవలం అధికారం ఉండదని, కానీ దానిపై బాధ్యతాయుతమైన డ్యూటీ ఉందన్నారు. ప్రజలు ఏమంనుకుంటున్నారు, తమ న్యాయం పట్ల ఎట్ల స్పందిస్తున్నారన్న ఆలోచన ఉండరాదన్నారు. వ్యక్తిగతంగా జడ్జీ ఆలోచించాలన్నారు, ప్రజలు చెప్పేది మన నిర్ణయాత్మక ఆలోచనల్లో భాగంగా కారాదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

