గుజరాత్ పోరుకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్.. సోషల్ మీడియా విభాగంతో శ్రీకారం
ఈ యేడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీకి కాస్త సీట్లు తగ్గాయి. కాంగ్రెస్ 77 సీట్లను సాధించుకుంది. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని అధిష్ఠానం ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటి నుంచే పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా మొదట సోషల్ మీడియా వింగ్‌పై గుజరాత్ పీసీసీ దృష్టి పెట్టింది.
సోషల్ మీడియా టీం మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. దాదాపు 200 మంది కొత్త వారిని సోషల్ మీడియా టీంలోకి తీసుకుంది. పార్టీ కార్యక్రమాలు, సిద్ధాంతంతో పాటు ఇరత కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ సూచించింది. 41 మంది అధ్యక్షులు, 15 మంది ఉపాధ్యక్షులు, 30 మంది ప్రధాన కార్యదర్శులు, 60 మంది ఆఫీస్ బేరర్స్‌ను ఈ విభాగంలో నియమించారు.
అయితే.. ఈ 200 మందిని కేవలం మెట్రో సిటీల నుంచి కాకుండా మండలాలు, జిల్లాల నుంచి కూడా తీసుకున్నామని గుజరాత్ పీసీసీ అధికార ప్రతినిధి మనీశ్ దోషి తెలిపారు. వచ్చే సారి అధికారమే లక్ష్యంగా పనిచేయాలని సూచనలు వచ్చాయని, అందుకే మొదట సోషల్ మీడియా విభాగాన్ని పటిష్ఠ పరుస్తున్నామని పేర్కొన్నారు. మరి కొన్ని రోజుల్లో సోషల్ మీడియాకు సంబంధించిన పెద్ద వర్క్‌షాప్‌ను నిర్వహించి, ట్రైనింగ్ ఇస్తామని కూడా దోషి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

