Rajnath Singh | డైనోసార్ల మాదిరిగా కాంగ్రెస్ అంతరించి పోతుంది: రాజ్నాథ్ సింగ్
Rajnath Singh | కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. డైనోసార్ల మాదిరిగా ఆ పార్టీ అంతరించిపోతుందని అన్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు.
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. డైనోసార్ల మాదిరిగా ఆ పార్టీ అంతరించిపోతుందని అన్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ఉత్తరాఖండ్లో పౌరి స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అనిల్ బలూనీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుందని హెచ్చరించారు. ‘కాంగ్రెస్ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు. కొన్నేళ్లలో డైనోసార్లా కాంగ్రెస్ కూడా అంతరించిపోతుందేమోనని నేను భయపడుతున్నా’ అని అన్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీని బిగ్ బాస్ హౌస్గా రాజ్నాథ్ సింగ్ పోల్చారు. ‘వారు (కాంగ్రెస్ నేతలు) రోజూ ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. ఆ పార్టీ కాస్త బుల్లితెరపై బిగ్ బాస్ ఇల్లులా మారిపోయింది. రోజూ ఒకరి బట్టలు ఒకరు చించుకుంటున్నారు’ అని విమర్శించారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని పిల్లలు కూడా గుర్తించలేరని ఎద్దేవా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

