Rahul Gandhi | అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ.. కీలక సమావేశాల్లో పాల్గొనున్న కాంగ్రెస్ నేత
Rahul Gandhi | కాంగ్రెస్ అధినేత అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లలో జరిగే పలు ముఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఇందులో టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమం జరుగనున్నది.
Rahul Gandhi | కాంగ్రెస్ అధినేత అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లలో జరిగే పలు ముఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఇందులో టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమం జరుగనున్నది. రాహుల్ పర్యటనపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడా తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా నియామకమయ్యాక రాహుల్ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయినప్పటి నుంచి ఆయనతో మాట్లాడాలని ఎన్నారైలు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు, అంతర్జాతీయ మీడియా నుంచి చాలా అభ్యర్థనలు వచ్చాయని పిట్రోడా పేర్కొన్నారు. సెప్టెంబర్ 8న డల్లాస్‌లో, సెప్టెంబర్ 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో ఉంటారని తెలిపారు. డల్లాస్‌లో టెక్సాస్ యూనివర్శిటీ విద్యార్థులతో, విద్యా సంఘం ప్రతినిధులతో కలిసి సంభాషించనున్నట్లు తెలిపారు.
అలాగే, పలువురు సాంకేతిక నిపుణులను కలువనున్నట్లు తెలిపారు. రెండోరోజు వాషింగ్టన్ డీసీకి వెళ్తారని చెప్పారు. అక్కడ థింక్ ట్యాంక్స్, నేషనల్ ప్రెస్ క్లబ్‌తో పాటు పలువురితో సంభాషించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటన చాలా విజయవంతమవుతుందని భావిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం రాయ్ బరేలీ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో ఆయన తల్లి సోనియా ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్ బరేలీతో పాటు కేరళ వయనాడ్‌లోని లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్నారు. రాహుల్ గాంధీ తొలిసారిగా 2004లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి గెలిచి లోక్‌సభకు వెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

