భారతీయ విలువలకు తగ్గట్లు చట్టసభ ప్రతినిధులు ప్రవర్తించాలి: ప్రధాని

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 82వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ఓ వ్యవస్థ కన్నా గొప్పదని, దేశ సమాఖ్య వ్యవస్థలో ప్రతి రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశం కోసం పనిచేయాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని, రాబోయే 25 ఏళ్లలో ఆ కర్తవ్యంతో ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. నూరవ స్వాతంత్య్రాన్ని టార్గెట్ చేస్తూ ఈ దీక్షను కొనసాగించాలన్నారు. పార్లమెంట్, శాసనసభలు ఇదే సందేశాన్ని వినిపించాలన్నారు. భారత్‌లో ఉన్న భిన్న సంస్కృతులు ఏకత్వం వల్లే పరిరక్షించబడుతున్నట్లు ఆయన చెప్పారు.
చట్టసభల్లో నాణ్యమైన, ఆరోగ్యకరమైన చర్చల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని ప్రధాని మోదీ సూచించారు. చాలా సిరీయస్‌గా, హుందాగా, రాజకీయాలకు అతీతంగా ఆ చర్చలు సాగాలన్నారు. చట్టసభ ప్రతినిధులు భారతీయ విలువలకు తగినట్లు ప్రవర్తించాలని ప్రధాని మోదీ సూచించారు. ఇటీవల పార్లమెంట్లో పదేపదే ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యం ఇండియాలో ఓ వ్యవస్థ మాత్రమే కాదు అని, అది ఇక్కడి సహజ విధానం అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

