ఐఏఎస్‌పై మహిళా కమిషనర్ సంచలన ఆరోపణలు..!
Rajasthan IAS Officer | రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పవన్ అరోరాపై కమిషనర్ పూజామీనా సంచలన ఆరోపణలు చేశారు. పవన్ అరోరా సెక్స్ రాకెట్ నడుపుతున్నారని, తనను వేధింపులకు చేసినట్లు ఆరోపించింది. తీవ్రమైన ఆరోపణలతో
జైపూర్ : రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పవన్ అరోరాపై కమిషనర్ పూజామీనా సంచలన ఆరోపణలు చేశారు. పవన్ అరోరా సెక్స్ రాకెట్ నడుపుతున్నారని, తనను వేధింపులకు చేసినట్లు ఆరోపించింది. తీవ్రమైన ఆరోపణలతో రాజస్థాన్‌లో కలకలం సృష్టించాయి. ఐఏఎస్ అధికారి పవన్ అరోరాకు ఓ మంత్రి రక్షణ కల్పిస్తున్నారన్నారు. అయితే, ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఐఏఎస్ అరోరా ఖండించారు. పూజా మీనా రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆమె ఝాలావర్ జిల్లా మున్సిపల్ కౌన్సిల్ మిషనర్‌గా పని చేస్తున్నారు.
ఆమె అక్కడి నుంచి బదిలీ కాగా.. పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ అరోరా పట్టణ స్థానిక సంస్థల విభాగం (DLB) డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ హౌసింగ్ బోర్డు కమిషనర్‌గా ఉన్నారు. వాస్తవానికి, జనవరి 9న పూజా మీనాను ఝలావర్ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ నుంచి నాగౌర్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆతర్వాత ఆర్డర్స్‌ను సవరిస్తూ డైరెక్టరేట్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మళ్లీ జనవరి 10న మరో కొత్త బదిలీ ఉత్తర్వులు జారీ కావడంతో జైపూర్ హెరిటేజ్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్‌గా నియామకమయ్యారు.
ఆరోపణలు ఏంటీ..?
పూజా మీనా మాట్లాడుతూ ‘ఐఏఎస్ పవన్ అరోరా చాలా చెత్త మనిషి. రాజస్థాన్ ప్రభుత్వంలో అతను అత్యంత వక్రబుద్ధిగల వ్యక్తి. పవన్ అరోరా నన్ను వేధిస్తున్నాడు. డీఎల్బీ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి మహిళ బృందాన్ని ఏర్పాటు చేసి.. డిపార్ట్మెంట్లో సెక్స్‌రాకెట్ నడిపాడు’ అని ఆరోపించారు. మరో అధికారి హృదేష్ శర్మ, మంత్రి ధరివాల్‌పై సైతం ఆమె ఆరోపణలు చేశారు. పూజామీనా 15 రోజుల కిందట మున్సిపల్ ఝాలవర్ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్‌గా నియామకమయ్యారు.
జనవరి 9న రెండు ఆకస్మిక బదిలీ నేపథ్యంలో ప్రస్తుత డీఎల్బీ డైరెక్టర్ హృదేష్ శర్మపై ఆరోపణలు చేశారు. పూజా మీనా బదిలీకి సంబంధించి ఉత్తర్వులను హృదేస్ శర్మ ఆమోదించారు. ముఖ్యమంత్రి గెహ్లాట్‌కు సన్నితుడైన మంత్రి శాంతి ధరివాల్ పవన్ అరోరాకు రక్షణ కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, పూజా మీనా ఆరోపణలను ఖండించారు. ఆరోపణలన్నీ నిరాధారమైనవి, తాను డీఎల్బీలో పోస్ట్ చేసినప్పుడు సదరు మహిళ ఒకటి, రెండుసార్లు పేపర్లతో తన ఛాంబర్‌కి వచ్చేదని, అంతే తప్ప ఎప్పుడూ చూడలేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

