న్యూఢిల్లీ, ఆగస్టు 1: కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.36 తగ్గింది. ఈ తగ్గింపు సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,976కు చేరింది.
స్థానికంగా విధించే పన్నులను బట్టి వివిధ రాష్ర్టాల్లో ధరలో మార్పు ఉంటుంది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు విమాన ఇంధన ధర 12 శాతం తగ్గింది.