భర్తకు విడాకులివ్వకుండా వేరొకరితో సహజీవనం చెల్లదు
భర్తకు విడాకులివ్వకుండా, వేరొకరితో సహజీవనం చేసేవారికి మద్దతుగా ఆదేశాలు జారీ చేయలేమని అలహాబాద్ హైకోర్టు ఇటీవల తెలిపింది. చట్టవిరుద్ధ బాంధవ్యాలకు రక్షణ కల్పిస్తే, సమాజంలో అరాచకం ప్రబలుతుందని చెప్పింది.
- అలహాబాద్ హైకోర్టు తీర్పు
అలహాబాద్: భర్తకు విడాకులివ్వకుండా, వేరొకరితో సహజీవనం చేసేవారికి మద్దతుగా ఆదేశాలు జారీ చేయలేమని అలహాబాద్ హైకోర్టు ఇటీవల తెలిపింది. చట్టవిరుద్ధ బాంధవ్యాలకు రక్షణ కల్పిస్తే, సమాజంలో అరాచకం ప్రబలుతుందని చెప్పింది. సహజీవనం చేస్తున్న జంట రక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ జంటలో మహిళకు 13 ఏళ్ల వయసులో ఓ వ్యక్తితో వివాహం జరిగింది.
ఆయనకు విడాకులివ్వకుండానే వేరొకరితో ఆమె సహజీవనం చేస్తున్నది. తమకు రక్షణ కల్పించాలని వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం స్పందిస్తూ, మహిళకు మెజారిటీ వయసు వచ్చిన తర్వాత అయినా తన భర్త నుంచి విడాకులు మంజూరు చేయాలని లేదా తమ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టును కోరలేదని గుర్తు చేసింది. వీరిద్దరికీ రక్షణ కల్పిస్తూ ఆదేశాలిస్తే, వీరి చట్ట వ్యతిరేక సంబంధాన్ని కోర్టు చట్టబద్ధం చేసినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

