Cobra in Refrigerator | శీతాకాలం కావడంతో చలి పెరిగింది. మనుషులకే కాదు పాములకు సైతం చలికి తట్టుకోలేక వెచ్చటి ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ భారీ నాగుపాము ఇంట్లోని రిఫ్రిజిరేటర్లో దూరింది. ఒక్కసారిగా పాములు చూసిన కుటుంబం షాక్ గురయ్యారు. ఈ ఘటన కర్ణాటక తమకూరులో చోటు చేసుకున్నది. ఆ తర్వాత తేరుకున్న కుటుంబం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. తమకూరు జిల్లా కొత్తగెరె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోని రిఫ్రిజిరేటర్ వెనుకభాగంలో కాంప్రెసర్ స్పైరల్ పైపు కింద దాక్కుతుంది. ఫ్రిజర్ వద్ద ఏయే శబ్దాలు రావడంతో పరిశీలించగా.. నాగుపాము కనిపించింది. ఒక్కసారిగా పామును చూసిన ఇంటి యజమాని ఖంగుతిన్నాడు. కుటుంబీకులు వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని పామును పట్టుకున్నారు. పామును జాగ్రత్తగా అటవీ ప్రాంతంలో వదిలి వేశారు. అయితే, పాము ఇంట్లోకి ఎలా దూరిందని తెలియదని ఇంటి యజమాని తెలిపాడు. చలికాలం కావడంతో పాములు వెచ్చటి ప్రదేశాల్లో తలదాచుకుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా.. చలికాలం నేపథ్యంలో కాన్పూర్ జూలాజికల్ పార్క్‌లోని స్నేక్హౌస్ను అధికారులు మూసివేశారు. చలి నుంచి పాములను రక్షించేందుకు ఎన్క్లోజర్లను గడ్డి, గోనె సంచులు, దుప్పట్లతో సహాయంతో మూసివేస్తున్నారు. ఎన్క్లోజర్లలో ఉన్న బొరియల్లోకి వెళ్లి నిద్రిస్తాయని జూపార్క్‌కు చెందిన అధికారి అనురాగ్ సింగ్ తెలిపారు. పాములు మూడు నెలలు నిద్రపోతాయని, ఈ నిద్రాణస్థితిని హైబర్నేషన్ అని పిలుస్తారన్నారు. చలికాలం ప్రభావం నుంచి తప్పించుకోవడానికి పాములు ఈ సీజన్లో దాదాపు మూడు నెలల పాటు నిరంతరం నిద్రిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత మార్చిలో మళ్లీ స్నేక్ ఎన్క్లోజర్లను తెరువనున్నట్లు అధికారులు వివరించారు.